గచ్చిబౌలి పోలీసులు పాత నేరస్థుడు కిలారి నాగతేజ అలియాస్ నాని(24)ని అరెస్ట్ చేశారు. ఇతను సోషల్ మీడియాలో మహిళలను ట్రాప్ చేసి, వారి వీడియోలు రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఇటీవల గచ్చిబౌలిలోని ఒక హోటల్‌లో ఓ యువతిని కత్తితో బెదిరించి, బలవంతంగా నగ్న వీడియోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ రూ.1.1లక్షలు వసూలు చేశాడు. శనివారం బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కత్తి, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.