భాగ్యనగరంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు

625చూసినవారు
హైదరాబాద్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా, అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్యాండీలు, లస్సీ తయారు చేస్తున్న కేంద్రంపై కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ బృందం దాడి చేసింది. ఈ దాడిలో భారీగా నిల్వ ఉంచిన ఐస్ క్యాండీలు, లస్సీ ప్యాకెట్లు, తయారీ యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అహ్మద్ నగర్, మెహిదీపట్నంకు చెందిన సయ్యద్ ముషారఫుద్దీన్ (24) అలియా ఐస్ క్రీమ్ పార్లర్ పేరుతో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. అతని వద్ద నుండి రూ. 5,44,290 విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్