
శంషాబాద్ వచ్చే 3 విమానాలకు బాంబు బెదిరింపులు
హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి మూడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కన్నూర్ నుంచి వచ్చిన ఇండిగో, ఫ్రాంక్ఫర్ట్ నుంచి లుఫ్తాన్సా, లండన్ నుంచి బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానాలకు ఈ బెదిరింపులు అందాయి. విమానాశ్రయంలో అప్రమత్తమైన అధికారులు, బాంబు స్క్వాడ్ బృందాలు విమానాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించి, ఐసోలేషన్ వార్డులకు తరలించారు.






































