
విద్యుత్ సమస్యలపై 'బస్తీ బాట'లో ఉద్యోగులు: పరిష్కారానికి హామీ
శేరిలింగంపల్లిలో తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ శాఖ చేపట్టిన 'బస్తీ బాట' కార్యక్రమంలో భాగంగా, శనివారం వెంకట్ రెడ్డి కాలనీలో తారానగర్ సెక్షన్ విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. స్థానికుల విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని ఉన్నతాధికారులకు నివేదించారు. ఏడీఈ శివ ప్రసాద్ మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.





































