అనుమానాస్పద స్థితిలో మృతి

16చూసినవారు
అనుమానాస్పద స్థితిలో మృతి
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో ఆదివారం ఉదయం నందిగామ మండలం చేగురు గ్రామానికి చెందిన హనుమంతు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విజయలక్ష్మి వే బ్రిడ్జ్ సమీపంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కొత్తూరు ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హనుమంతు మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇది ప్రమాదమా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్