చెరువులో పడి గురుకుల విద్యార్థి గల్లంతు

490చూసినవారు
చెరువులో పడి గురుకుల విద్యార్థి గల్లంతు
షాద్ నగర్ పరిధిలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ వసతి గృహంలో చదువుతున్న రాజు అనే విద్యార్థి, మంగళవారం నాడు హోలీ సెలవు సందర్భంగా స్నేహితులతో కలిసి ఫరూక్ నగర్ మండలం రాయికల్ శివారులోని చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజు, వసతి గృహంలో చదువుకుంటున్నాడు. మధ్యాహ్నం నుండి కనిపించకపోవడంతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్