రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం, జిల్లేడు చౌదరి గూడెం మండలం, పెద్ద ఎలకిచర్ల గ్రామంలో ఇద్దరు కౌలు రైతులైన కందూరి గోవర్ధన్ రెడ్డి, ఘనపురం జనార్ధన్ రెడ్డిలకు చెందిన 60 క్వింటాళ్ల పత్తిని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం తర్వాత దహనం చేశారు. సుమారు ఐదు లక్షల రూపాయల విలువైన ఈ పత్తిని, వారు మార్కెట్లో విక్రయించేందుకు ఇంట్లో నిల్వ చేసుకున్నారు. కక్షపూరితంగా ఈ ఘటనకు పాల్పడిన దుండగులపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.