రంగారెడ్డి: లారీ ఢీకొని మహిళ మృతి

0చూసినవారు
రంగారెడ్డి: లారీ ఢీకొని మహిళ మృతి
ఆమనగల్ నుంచి షాద్ నగర్ వెళ్లే రహదారిపై బుధవారం అతివేగంతో వచ్చిన లారీ బైకును ఢీకొనడంతో, బైకుపై వెనుక కూర్చున్న జంగమ్మ (50) అక్కడికక్కడే మృతి చెందింది. బైకు నడుపుతున్న ఆమె అల్లుడు కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. తలకొండపల్లి మండలం లింగరావుపల్లి గ్రామానికి చెందిన వీరు తలకొండపల్లికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జానకిరామిరెడ్డి తెలిపారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్