రంగారెడ్డి: కొడుకు కోసం తండ్రి బావిలో దూకి సూసైడ్.. ఇద్దరి మృతదేహాలు లభ్యం

15చూసినవారు
రంగారెడ్డి: కొడుకు కోసం తండ్రి బావిలో దూకి సూసైడ్.. ఇద్దరి మృతదేహాలు లభ్యం
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సంతాపూర్ గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కనిపించకుండా పోయిన తన 11 ఏళ్ల కుమారుడు కన్నయ్య కోసం మనస్థాపానికి గురైన తండ్రి తూర్పాటి యాదయ్య (40) తాను పనిచేస్తున్న వ్యవసాయ క్షేత్రంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో, మృతుని శవాన్ని వెలికితీసేందుకు బావిలోకి దిగిన అగ్నిమాపక సిబ్బందికి, తండ్రి మృతదేహంతో పాటు కుమారుడి మృతదేహం కూడా లభించింది. ప్రాథమిక విచారణలో బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడని, ఆందోళనతో తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్