వెంచర్ లో మహిళ మృతదేహం కలకలం

0చూసినవారు
వెంచర్ లో మహిళ మృతదేహం కలకలం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని జేఎస్ఆర్ వెంచర్ లో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మృతదేహం ఉబ్బిపోయిన స్థితిలో ఉంది. మృతురాలి ఒంటిపై ఉన్న వస్త్రాలు, చెప్పులు, స్కార్ఫ్ ఆధారంగా ఆమెను కొందుర్గు మండలం చిన్నేర్కిచర్ల గ్రామానికి చెందిన కుమ్మరి మంగమ్మగా గుర్తించారు. ఒంటిపై బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో హత్య చేసి, ఆభరణాలు అపహరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్