తాండూరు పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో గురువారం బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రూ. 1. 30 లక్షల లోన్ తీసుకున్నారు. తదనంతరం మళ్లీ కారులో బయలుదేరారు. కొద్ది దూరంలో టైర్ పంచర్ కావడంతో శారద భర్త రాజు కారు టైర్ పంచర్ చేయించడానికి తీసుకెళ్లాడు. ఇదంతా గమనించిన ఓ దుండగుడు భార్య శారదకు మాయమాటలు చెప్పి కారులో నుంచి దించి డబ్బుల బ్యాగుతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో బాధితులు తాండూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.