జిల్లాలోని పెద్దేముల్ మండలం గొట్లపల్లి నామినేషన్ క్లస్టర్ లో చోరీ జరిగింది. గొట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, జయరాం తండా (ఐ) గ్రామాలకు సంబంధించిన నామినేషన్ పత్రాలను తాళం పగలగొట్టి దొంగిలించారు. ఈ ఘటనతో కలకలం రేగింది. సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, తాండూర్ డిఎస్పి నర్సింగ్ యాదయ్య, తహసిల్దార్ వెంకటేష్ ప్రసాద్, స్థానిక ఎస్సై శంకర్ క్లస్టర్ ను సందర్శించి విచారణ చేపట్టారు. ఆన్లైన్ డేటా అందుబాటులో ఉందని, ఎన్నికలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని అధికారులు తెలిపారు.