వికారాబాద్: నదిలో మునిగి ఒకరు మృతి

2చూసినవారు
వికారాబాద్: నదిలో మునిగి ఒకరు మృతి
యాలాల మండల పరిధిలోని కాగ్నా నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు. పాత తాండూరుకు చెందిన రహపత్, జహీరాబాద్ సమీపానికి చెందిన బంధువు మోజిన్ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. కోకట్ బ్రిడ్జి సమీపంలో కాగ్నా నదిలో ఈత కొట్టేందుకు దిగిన వీరిలో ఒకరు మృతి చెందగా, మరొకరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. నది లోతును అంచనా వేయలేకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్