
చెల్లిని వేధించొద్దన్నందుకు యువకుడిపై కర్రలతో దాడి !
హర్యానాలోని ఫతేపూర్ బిల్లోచ్ గ్రామంలో, తన సోదరిని వేధిస్తున్న ముఠాను నిలదీసినందుకు 19 ఏళ్ల యువకుడిపై దుండగులు సుత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలై, శరీరంలో పలుచోట్ల ఎముకలు విరిగాయి. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.




