హైదరాబాద్లోని కమలానగర్లో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత, అభ్యుదయవాది తాపీ ధర్మారావు జయంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమం జరిగింది. గొడుగు యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎం. భాస్కరరావు, శోభ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ తాపీ ధర్మారావు సాహిత్యం, పత్రికా, సినిమా రంగాలతో పాటు సామాజిక ఉద్యమాల్లో విశేష కృషి చేశారని, మూఢనమ్మకాలు, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించారని కొనియాడారు.