కాప్రాలోని కమలానగర్‌లో 4-2-2026న స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గొడుగు యాదగిరి రావు అధ్యక్షత వహించారు. హరిప్రసాద్, బాలులు పూలార్పణ చేశారు. శ్రీమన్నారాయణ మాట్లాడుతూ, "సాయుధ పోరాట యోధుడు, కార్మిక నాయకుడు, ఉర్దూ కవి. ప్రపంచ శాంతికి కృషి!" అని కొనియాడారు. అనురాధ మాట్లాడుతూ, "తాత సుందరయ్యలకు కొరియర్. తేలు కాటు ఎదుర్కొని నిబ్బరం చూపారు!" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోజా రాణి, శారద, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.