ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అరణ్యంలో ఎండి ఖాజా అనే యువకుడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. ఖాజా పుట్టుకతో మూగవాడని, గత నాలుగు రోజులుగా కనిపించకుండా పోయాడని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.