ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి శాంతినగర్ లో ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసైన పాలడుగు సాయి (24) అనే యువకుడు అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి అన్న నవీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.