హైదరాబాద్ నగర వాసులక
ు అలర్ట్. ఫ్లైఓవర్ పనుల నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డు నేటి నుంచి తాత్కాలికంగా మూసివేయబడుతుంది. హన్మకొండకు వెళ్లే బస్సుల కోసం నల్లచెరువు వద్ద బస్టాండ్ ఏర్పాటు చేశారు. బోడుప్పల్ వైపు నుంచి వచ్చే వాహనాలు భగాయత్ లే-అవుట్ ద్వారా నాగోల్ చేరుకోవాలి. వరంగల్ వైపు వెళ్లే వాహనాలు నాచారం ద్వారా చెంగిచర్లకి వెళ్లి, ఆపై హైవేకి చేరుకోవాలని అధికారులు సూచించారు.