ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అమలు సాధన సమితి ప్రతినిధి బృందం, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్‌ను సెక్రటేరియట్‌లో కలిసి పలు కీలక డిమాండ్లు వినిపించింది. వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక శాఖ ఏర్పాటు, బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ, పింఛన్ రూ. 6,000కు పెంపు, తీవ్ర వైకల్యం కలిగిన వారికి రూ. 15,000 పింఛన్, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని వారు కోరారు.