కుషాయిగూడ పోలిస్టేషన్ పరిధిలో దారుణం

1చూసినవారు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా సాయిప్రియ కాలనీలో మైనర్ బాలికతో ఒక వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించిన దారుణం చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మైనర్ బాలిక స్టేట్మెంట్ నమోదు చేసేందుకు ఆమెను భరోసా సెంటర్ కు తరలించారు. బాలిక స్టేట్మెంట్ ఆధారంగా నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్