తెలంగాణ ప్రభుత్వ 100 రోజుల ప్రణాళికలో భాగంగా బోడుప్పల్ కార్పొరేషన్ 5వ డివిజన్ ఐఐసిటి కాలనీలో తడి, పొడి చెత్తల విభజనపై అవగాహన కల్పించారు. కమిషనర్ శైలజ, మాజీ కార్పొరేటర్ పద్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చెత్త వేరు చేసి పర్యావరణం కాపాడాలని పిలుపునిచ్చారు. కాలనీ నాయకులు, నివాసితులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.