
కన్న కూతురికి కిడ్నీ దానం చేసి రెండో జన్మ ప్రసాదించిన తండ్రి
ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ క్యూటీ మెందిరత్తాకు ఆమె తండ్రి యోగేశ్ మెందిరత్తా తన కిడ్నీని దానం చేసి రెండో జన్మను ప్రసాదించారు. రెండు మూత్రపిండాలు పాడైన క్యూటీకి కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు చెప్పడంతో, తండ్రి ముందుకు వచ్చారు. నెల క్రితం జరిగిన ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ తర్వాత క్యూటీ కోలుకుంటోంది. లక్షల్లో ఫాలోవర్లు ఉన్న క్యూటీకి ఈ ఘటన కొత్త జీవితాన్ని ఇచ్చింది.




