
సైనికుడు ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో
TG: ఆస్తి తగాదాలతో ఓ సైనికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్లో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన దొడ్ల అశోక్ గౌడ్ ఆర్మీలో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే తనకు పంపకాల్లో న్యాయం జరగలేదని.. సెల్ఫీ వీడియో తీసుకుని టాబ్లెట్స్ మింగి ఆత్మహత్యాత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.




