బోడుప్పల్ నారాయణ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వ పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులతో కలిసి ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు, మెడల్స్ అందించి, కేక్ కట్ చేసి విజయాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. పాఠశాల ఏజీఎం బాల పరమేశ్వర రావు విద్యార్థులకు ఉన్నత చదువులలో కూడా మంచి మార్కులు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.