
లేడీస్ హాస్టల్లోకి చొరబడి ఎంబీఏ విద్యార్థినిపై వృద్ధుడు అత్యాచారం
ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఓ విద్యార్థినిపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గంగాపడ ప్రాంతంలో నివసించే దీపక్ ప్రధాన్(67) కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఆ షాపు పక్కనే మహిళా హాస్టల్ ఉంది. అయితే ఏప్రిల్ 24న దీపక్ ప్రధాన్ ఆ హాస్టల్లోకి చొరబడి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. సదరు యువతిని వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.




