రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాగన్నగూడా శోభనగర్ లో, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలు చెన్నమ్మ (62) మెడలోంచి మూడున్నర తులాల పుస్తెలతాడును గుర్తు తెలియని దుండగుడు అపహరించాడు. ఉదయం తెల్లవారుజామున కూరగాయలు అమ్మడానికి వెళుతుండగా, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి బస్ స్టాండ్ వద్దకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.