ఉప్పల్ ప్రాంత అభివృద్ధిలో భాగంగా, ఉప్పల్ భగాయత్‌లో మల్కాజిగిరి నగర పాలక సంస్థ నూతన ప్రధాన కార్యాలయ భవనానికి ఈ నెల 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ జరగనుంది. 9 ఎకరాల విస్తీర్ణంలో రూ. 99 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ఈ భవనం, మూసీ నది ఒడ్డున ఉండి మల్కాజిగిరి ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాజెక్టు సాధనలో మందుముల పరమేశ్వర్ రెడ్డి కృషిని పార్టీ నాయకులు ప్రశంసిస్తున్నారు.