ఉస్మానియా లో కారుణ్య నియామకాలు..

4చూసినవారు
ఉస్మానియా లో కారుణ్య నియామకాలు..
ఉస్మానియా విశ్వవిద్యాలయం అకాల మరణం చెందిన ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలుస్తూ కారుణ్య నియామకాలు చేపట్టింది. విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో వీసీ ప్రొఫెసర్ కుమార్ చేతుల మీదుగా ముగ్గురు ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి నియామక పత్రాలు అందజేశారు. జి. శ్రీకాంత్ ఆఫీస్ సబార్డినేట్ గా, కె. ప్రసాద్, పి. శ్వేత జూనియర్ అసిస్టెంట్లుగా నియమితులయ్యారు. ఉద్యోగుల కుటుంబాల సంక్షేమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని వీసీ ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్