ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందమూల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో శక్తి సాయి నగర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. మల్లికార్జున్ నగర్ కాలనీ, రోడ్ నెంబర్–1లో సుమారు రూ. 17 లక్షల వ్యయంతో నూతన భూగర్భ డ్రైనేజీ పనులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఉమ్మడి మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నెమలి అనిల్ కుమార్ ముఖ్య పాత్ర పోషించారు.