
బస్సుల్లో ఏఐ కెమెరాలు.. డ్రైవర్ నిద్రపోతే ప్రమాదమే!
ఏపీ రవాణా శాఖ బస్సుల్లో AI ఆధారిత డ్యాష్‌క్యామ్‌లను ఏర్పాటు చేస్తోంది. డ్రైవర్ నిద్రపోవడం, ఆవలించడం, ఫోన్ మాట్లాడటం, సిగరెట్ తాగడం వంటివి గుర్తిస్తే వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు బాధ్యులను గుర్తించడం సులభమవుతుంది. ఇప్పటికే 391 బస్సుల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయగా, రాష్ట్రవ్యాప్తంగా 2 వేల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.




