తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి మాదిగలకు కేటాయించాలని రేవంత్ రెడ్డిని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ డిమాండ్ చేశారు. ఏప్రిల్ నెలలో అభిషేక్ సింగ్వి, సురేష్ కుమార్ రెడ్డిల పదవీకాలం ముగియడంతో ఈ రెండు సీట్లు ఖాళీ అవుతున్నాయని తెలిపారు.