నాచారం డివిజన్ అభివృద్ధికి నిధుల కేటాయింపు విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న భవాని నగర్లో నాచారం సీనియర్ నాయకులు సాయి జెన్ శేఖర్ మాట్లాడుతూ, డివిజన్ అభివృద్ధికి నిధులను తామే తెచ్చామని తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా, నేడు రాఘవేంద్ర నగర్లో నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారం శ్రీకాంత్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ నిధులు అందిస్తుందని చెప్పడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇరు పార్టీల నాయకులు నిధుల విషయంలో తమదే పైచేయి అని వాదిస్తున్నారు.