ఎన్నికల అవకతవకలపై సీపీఎం నిరసన..ఈసీఐఎల్ చౌరస్తాలో ఆందోళన

4చూసినవారు
ఎన్నికల అవకతవకలపై సీపీఎం నిరసన..ఈసీఐఎల్ చౌరస్తాలో ఆందోళన
హైదరాబాద్, అంబర్‌పేట్, ఉప్పల్ లోని ఈసీఐఎల్ చౌరస్తాలో ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ సీపీఎం కాప్రా సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు. కాప్రా సర్కిల్ కార్యదర్శి జి. శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి. సత్యం, కోమటి రవి, ఏ. అశోక్ లు మాట్లాడుతూ, ఓటర్ల జాబితా, ఫారం-6 మార్పులపై అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్