మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఐఎన్టీయూ నాయకులు అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు వంటి సమస్యలను పరిష్కరించాలని, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేలా చూడాలని కోరారు.