
ప్రియాంక వ్యాఖ్యలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయి: ధర్మేంద్ర ప్రధాన్
దేశంలో అమలవుతున్న విద్యా వ్యవస్థపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా ఖండించారు. నూతన విద్యా విధానం, పిఎం శ్రీ పథకాలు పిల్లలను బ్రెయిన్ వాష్ చేయడానికి ఉద్దేశించినవని ప్రియాంక ఆరోపించగా కౌంటర్ ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలు అజ్ఞానాన్ని, రాజకీయ అవకాశవాదాన్ని ప్రదర్శిస్తున్నాయని, వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని ప్రధాన్ అన్నారు.




