సినీ నటుడు రఘునాథ రెడ్డి కన్ను మూత...

3చూసినవారు
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి ప్రథమపురి కాలనీలో నివసించే ఫిల్మ్ ఆర్టిస్ట్ కాలకోట రఘునాథరెడ్డి శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. నెల రోజుల క్రితం తన కొడుకు గుండెపోటుతో మరణించడంతో, అదే బెంగతో ఆయన కూడా మరణించినట్లు తెలుస్తోంది. సుమారు 350 సినిమాలకు పైగా నటించిన రఘునాథరెడ్డి, 'కలిసుందాం రా', 'ఒసేయ్ రాములమ్మ', 'ఇంద్ర', 'డాన్', 'తమ్ముడు' వంటి చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్