మల్లాపూర్ లో ఆహార భద్రత శాఖ సప్లై స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు..

2చూసినవారు
ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ లో ఆహార భద్రత శాఖ సప్లై స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. కుల్ఫీ ఫాలుదా, బాదం మిల్క్ తయారీ యూనిట్లలో అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బాదం మిల్క్ తయారీలో అపరిశుభ్రత, ఉత్పత్తుల వద్ద ఈగలతో నిండిన వాతావరణం వంటివి బయటపడ్డాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, సుమారు 50 లీటర్ల ఉత్పత్తులను అక్కడికక్కడే అధికారులు పారబోశారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్