మేడే సందర్భంగా భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు వేముల మారయ్య కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాచారంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలను కాలరాస్తూ, పని సమయాన్ని పెంచడం ద్వారా వారి శ్రమను దోచుకుంటోందని ఆరోపించారు. ఈ లేబర్ కోడ్ లు కార్మికుల హక్కులను కాలరాసేవని ఆయన అభిప్రాయపడ్డారు.