మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ. వినయ్ కృష్ణా రెడ్డి, చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా స్వచ్ఛ ఆటోలకు ఇవ్వాలని తెలిపారు. 99 రోజుల కార్యాచరణ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున ఉప్పల్ మెట్రో స్టేషన్, సరస్వతి నగర్, ఉప్పల్ భగాయత్, దేవేంద్ర నగర్, రామంతపూర్ పెద్ద చచెరువు ప్రాంతాల్లో అధికారులు సిబ్బందితో కలిసి పర్యటించి, పరిశుభ్రతపై సూచనలు చేశారు.