మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, ఆధారాలు లేకుండా
కాంగ్రెస్ ప్రభుత్వం, గురుకుల శాఖ మంత్రులపై చేస్తున్న ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తీవ్ర హెచ్చరిక చేశారు. గురుకులాల్లో రూ. 2, 000 కోట్ల అవినీతి జరిగిందంటూ హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.