హోలీ వేడుకలు: మద్యం దుకాణాలు, బార్లకు మూసివేత ఆదేశాలు

0చూసినవారు
హోలీ వేడుకలు: మద్యం దుకాణాలు, బార్లకు మూసివేత ఆదేశాలు
హోలీ పండుగ సందర్భంగా నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు, ప్రజలు ప్రశాంతంగా పండుగ జరుపుకునేలా మల్కాజిగిరి CP అవినాష్ మహంతి కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని వైన్ షాపులు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లను మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆదేశాలు హైదరాబాద్, ఉప్పల్, మేడ్చల్ ప్రాంతాలకు వర్తిస్తాయి.

సంబంధిత పోస్ట్