ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రలాజికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో అఖిల భారత జ్యోతిష్య సదస్సు హైదరాబాద్, ఉప్పల్ ఎస్‌వీఎం గ్రాండ్‌లో ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది కార్యవర్గ సభ్యులు, చాప్టర్ చైర్‌పర్సన్‌లు, జ్యోతిష్య నిపుణులు,
విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సాంప్రదాయబద్ధంగా దీప ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభోపన్యాసంలో ప్రముఖ జ్యోతిష్యవేత్త గాయత్రీ వాసుదేవ్ మాట్లాడుతూ, ఒక వైదిక జ్యోతిష్కుడు సత్యనిష్ఠ, గణిత నైపుణ్యం, నిష్పక్షపాత వైఖరి, సేవాభావం, ఉల్లాస స్వభావం వంటి లక్షణాలను కలిగి ఉండాలని పేర్కొన్నారు.