ఆదివారం దుబాయ్ లో జరగనున్న భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ను రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వద్ద నిరసన తెలిపారు. పహల్గామ్ లో మన ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచిన పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఎలా ఆడనిస్తారని ప్రధాని మోడీ, బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.