ఉప్పల్ నియోజకవర్గంలోని శక్తిసాయినగర్ డివిజన్ పరిధిలోని బ్రహ్మపురి కాలనీలో జరుగుతున్న నూతన రోడ్ల నిర్మాణ పనులను గ్రేటర్
కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్, శక్తిసాయినగర్ డివిజన్ ఏఈ స్పందనతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని నెమలి అనిల్ అన్నారు.