హైదరాబాద్లోని సెయింట్ పియస్ X డిగ్రీ అండ్ పీజీ మహిళా కళాశాల విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు, నూతన ఆవిష్కరణలకు బాటలు వేసేందుకు సోమవారం 'అంతర్గత హ్యాకథాన్–2026'ను నిర్వహించింది. స్మార్ట్
ఇండియా హ్యాకథాన్–2026లో భాగంగా, కళాశాల వాణిజ్య విభాగం, సంస్థాగత ఆవిష్కరణ మండలి (ఐఐసీ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ పోటీలో కళాశాల నుంచి 13 బృందాలు పాల్గొని తమ వినూత్న ఆలోచనలను ప్రదర్శించాయి. ఈ హ్యాకథాన్ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఒక వేదికగా నిలిచింది.