జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను ఎత్తివేయాలి: అఖిలపక్షం

0చూసినవారు
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను ఎత్తివేయాలి: అఖిలపక్షం
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నాగారంలోని ఎం. ఆర్. వై. ఫంక్షన్ హాల్‌లో వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీని ఏర్పాటు చేశారు.
సమావేశంలో సిపిఎం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి. సత్యం మాట్లాడుతూ. డంపింగ్ యార్డ్ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు కాలుష్యం, దుర్వాసన, భూగర్భ జలాల కలుషితంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే చెత్త తరలింపును నియంత్రించి, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్