
గిల్ కెప్టెన్సీపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడి జోస్యం
భారత క్రికెట్ జట్టులో శుభ్‌మన్ గిల్ శకం ప్రారంభమైంది. టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్‌గా, టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌తో గిల్ కెప్టెన్సీ బాధ్యతలు మొదలవుతాయి. అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్, గిల్ కెప్టెన్సీకి బ్యాడ్ ఓపెనింగ్ ఉంటుందని, ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ ఆడుతున్నప్పటికీ ఓటమి తప్పదన్నారు.




