కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ బి కాలనిలో నివసించే రవీందర్ తన కుటుంబంతో కలసి ఈ నెల 5న ఇంటికి తాళం వేసి తన కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు. తిరిగి మంగళవారం రాగా తన ఇంటి ప్రధాన తలుపు తాళం పగిలిపోయి ఉండటం గమనించారు. బెడ్ రూమ్ లో ఉన్న బీరువా విరిగిపోయి . బీరువాను తనిఖీ చేయగా రూ.1. 5 లక్షల నగదు, 30 తులాల బంగారం, 2 కిలోల వెండి అపహరణకు గురయ్యాయి అని అన్నారు.