కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జై జవాన్ కాలనీకి చెందిన మన్నె నరేందర్ (31) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో సోమవారం మధ్యాహ్నం ఈసీఐఎల్‌లోని ఆర్ స్క్వేర్ ఓయో రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు గతంలో సీఎంఆర్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేసి మానేశాడు. తండ్రి మరణించడంతో తల్లితో కలిసి ఉంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.